పడవలో వెళ్లి అమరావతి ఐకానిక్​ టవర్లు పరిశీలించిన ఐఐటీ బృందం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణుల బృందాలు పర్యటించాయి. ఐదేళ్లుగా ఉపయోగానికి నోచుకోని ఐకానిక్ టవర్ల ర్యాఫ్ట్ ఫౌండేషన్​ను ఐఐటీ మద్రాస్‌ బృందం పరిశీలించింది. అనంతరం సచివాలయం, హెచ్​ఓడీ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్ మెంట్లను పరిశీలించారు.

 ఐఐటీ మద్రాస్‌లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రోఫెసర్ మెహర్ ప్రసాద్, కొరోజన్ విభాగంలో నిపుణుడైన ప్రోఫెసర్ రాధాకృష్ణ పిళ్లై, ఫౌండేషన్, మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రోఫెసర్ సుభాదీప్ బెనర్జీలు అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్​ను పరిశీలించినట్లు అమరావతి అధికారులు మీడియాతో తెలిపారు.