
తాడ్వాయి, వెలుగు : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ దత్తత గ్రామమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తిని సోమవారం గవర్నర్ సెక్రటరీ టీమ్ సందర్శించింది. సంయుక్త కార్యదర్శి భవాని శంకర్, పర్సనల్ సెక్రటరీ పవన్ సింగ్ ఆధ్వర్యంలో ఇండియన్ ట్రైబల్ కేర్ జనరల్ సెక్రటరీ గోవిందదాస్, రాధా కన్నయ్య దాస్ వెళ్లి గ్రామానికి వెళ్లి మసాలా తయారీ యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు.
గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారని, మసాలా యూనిట్, టైలరింగ్ సెంటర్ జీవనోపాధికి ఎంతో ఉపయోగంగా ఉంటాయని పేర్కొన్నారు. వృత్తి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ మధుకర్ ను మసాలా యూనిట్ అభివృద్ధికి ఏం చేయాలని అడిగారు. మిర్చీ, పసుపు కొమ్ములు కొనుగోలుపై సంఘం సభ్యులకు టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చామని పసుపు, కారం, బియ్యం, వారితోనే పట్టించామని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఈ వీరభద్రం, వృత్తి సంస్థ విలేజ్ కో– ఆర్డినేటర్ సూదికొండ గణేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.