ఎస్సీ గురుకులాలు బాగున్నయ్ : లక్ష్మీప్రియ కితాబు

ఎస్సీ గురుకులాలు బాగున్నయ్ : లక్ష్మీప్రియ కితాబు
  • తమిళనాడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ లక్ష్మీప్రియ కితాబు

హైదరాబాద్, వెలుగు : ఎస్సీ గురుకులాల్లో టీచింగ్, వసతులు బాగున్నాయని తమిళనాడు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల బృందం మెచ్చుకుంది. బుధవారం తమిళనాడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ లక్ష్మీప్రియ, నలుగురు అధికారులు గచ్చిబౌలి గోపనపల్లి సమీపంలోని గౌలిదొడ్డి ఎస్సీ వెల్ఫేర్ ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్ ను సందర్శించారు. స్టూడెంట్లతో మాట్లాడారు.

తమిళనాడులోని గురుకులాల గురించి వివరించారు. ఇక్కడి అంశాలను తమిళనాడు సీఎం దృష్టికి తీసుకెళ్లి అక్కడి అమలుచేసేలా కృషి చేస్తామని లక్ష్మీప్రియ చెప్పారు. అంతకుముందు తమిళనాడు ఆఫీసర్ల బృందం మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లో ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణితో భేటీ అయ్యారు. కొద్ది రోజుల కింద బిహార్​ఎస్సీ వెల్ఫేర్ అధికారులు వచ్చి గురుకులాలను పరిశీలించారని వర్షిణి  చెప్పారు.