అశ్వారావుపేట, వెలుగు: దాతల విరాళాలతో పట్టణంలోని గుర్రాల చెరువు రోడ్ లో ఉన్న హిందూ శ్మశాన వాటికలో పది అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏపీలోని తిరువూరు గ్రామం నుంచి విగ్రహాన్ని తెప్పించి ఆదివారం ప్రతిష్ఠించారు. శ్మశాన వాటికలో కాటి కాపరి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్థానిక కెమిలాయిడ్స్ఫ్యాక్టరీ మేనేజర్ వేలూరు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజల అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జూపల్లి రమేశ్, అంకత మల్లికార్జునరావు, మందపాటి మోహన్ రెడ్డి, సంకా ప్రసాద్, విగ్రహ నిర్మాణ కమిటీ నిర్వాహకులు మానేపల్లి ఏసు, లక్ష్మణరావు, కృష్ణారావు పాల్గొన్నారు.