
జైనథ్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్లు టెన్త్ పరీక్షలు రాస్తుండగా పెచ్చులూడిపడ్డాయి. ఈ ఘటనలో ఓ విద్యార్థిని, ఇన్విజిలేటర్ గాయపడ్డారు. గిమ్మ గ్రామానికి చెందిన పడాలి అక్షయ.. పిప్పర్ వాడలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం స్థానిక జడ్పీహెచ్ఎస్లోని పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాస్తుండగా స్లాబ్ పెచ్చులూడి మీద పడ్డాయి. దీంతో అక్షయ తలకు గాయమైంది. పక్కనే ఉన్న ఇన్విజిలేటర్పురుషోత్తం కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఎగ్జామ్ దాదాపు పూర్తయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది అక్షయకు ఫస్ట్ ఎయిడ్ చేసి పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ మూడు కుట్లు వేసి ఇంటికి పంపించారు.