స్కూల్​కు వెళ్లిన పదో తరగతి విద్యార్థి తిరిగి ఇంటికి చేరలేదు..?

మియాపూర్​, వెలుగు : స్కూల్​కు వెళ్లిన పదో తరగతి విద్యార్థి తిరిగి ఇంటికి చేరలేదు. మియాపూర్​ పీఎస్​​ పరిధిలోని  గోకుల్​ ప్లాట్స్ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో  ఉండే ఈశ్వరయ్య కూలీ. ఇతని చిన్న కుమారుడు ప్రకాశ్​(14) మియాపూర్​లోని ప్రభుత్వ పాఠశాలలో టెన్త్​ చదువుతున్నాడు.

20 రోజులుగా ప్రకాశ్​ స్కూల్​కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుండడంతో  ఈ నెల 9న  తల్లి మందలించింది. దీంతో మంగళవారం ఉదయం స్కూల్​కు వెళ్తున్నానని  చెప్పి బయటకు వెళ్లిన ప్రకాశ్​ సాయంత్రం తిరిగి రాలేదు. తల్లిదండ్రులు స్కూల్​కు వెళ్లి విచారించగా ప్రకాశ్​ స్కూల్​కు  రాలేదని తెలిసింది.