ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ..

మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాలిలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే మలేషియాలో నేవీ పరేడ్ కోసం రిహార్సల్ లో భాగంగా గాలిలోకి చాలా హెలికాప్టర్లు ఎగిరాయి. ఈ క్రమంలోనే అదుపు తప్పి రెండు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్న పది మంది మృతి చెందినట్టు ఆ దేశ నేవీ దళం వెల్లడించింది.

 పశ్చిమ రాష్ట్రమైన పెరాక్‌లోని లుముట్ నౌకాదళ స్థావరం వద్ద మంగళవారం ఉదయం 9.32 గంటలకు ప్రమాదం జరిగిందని వెల్లడించింది అక్కడి ప్రభుత్వం. బాధితులందరూ సంఘటనా స్థలంలో చనిపోయినట్లు నిర్ధారించబడ్డారని ప్రకటించింది. గుర్తింపు కోసం లుముట్ ఆర్మీ బేస్ ఆసుపత్రికి పంపామని అని తెలిపింది.