![బ్రిడ్జి పై నుంచి 20 అడుగుల లోయలో పడిన బస్సు.. 51 మంది మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/a-terrible-bus-accident-happened-in-guatemala_7bLOIeqPME.jpg)
గ్వాటెమాల సిటీ: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 20 అడుగల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులోని 51 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ విషాద ఘటన గ్వాటెమాల దేశంలో చోటు చేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం (ఫిబ్రవరి 10) ప్యూంటె బెలిస్ వంతెనపై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. బస్సు లోయలో పడిపోవడంతో అందులోని 51 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు.
ALSO READ | మూడంటే.. 3 సెకన్లలో కళ్ల ముందు డాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోయింది
సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గ్యాటెమాల రెస్య్కూ బృందాలు, సైన్యం సహయక చర్యల్లో పాల్గొంది. ఈ దుర్ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.