ఘోర అగ్నిప్రమాదం.. లారీ, అంబులెన్స్ పూర్తిగా దగ్ధం

నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పీఏపల్లి మండలంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై నీలంనగర్  స్టేజి వద్ద ముందు వెళ్తున్న లారీని 108 అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్, లారీ రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి.  హైదరాబాద్ నుండి 108 వాహనం మరమ్మత్తులు చేసుకొని అంగడిపేట స్టేజ్ కి వద్ద వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.

 ప్రమాదంలో 108 డ్రైవర్ శేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని  గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.