నిజామాబాద్​ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

నిజామాబాద్:  నిజామాబాద్​ పట్టణ శివారులోని అర్సపల్లి బైపాస్​రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్​ నుంచి ఏప్రిల్​ 27 సాయంత్రం రెంజల్​ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆశోక లే ల్యాండ్​ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నుజ్జయిన మృతదేహాలతో ఘటనా స్థలం భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భవన నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు ఆటోలో ఉన్నట్లు తెలిసింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.