జడ్జి తల్లి ఇంట్లో బూట్లు ఎత్కపోయిన దొంగ

జడ్జి తల్లి ఇంట్లో బూట్లు ఎత్కపోయిన దొంగ

జడ్జి గారి తల్లి ఇంట్లో ఓ వ్యక్తి దొంగతనానికి యత్నించి.. చివరకు ఒక జత బూట్లను ఎత్తుకెళ్ళాడు. ఈ సంఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. గత ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ చిల్లర దొంగ చిల్లర వేషాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 

ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్​పల్లి ఫ్యామిలీ కోర్టుకు చెందిన జడ్జి మురళీ మోహన్​ తల్లి, సోదరుడు రాజ్​కుమార్ ఉప్పుగూడ కృష్ణారెడ్డి నగర్ లో నివాసముంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గేట్​పైకి ఎక్కి ఇంట్లోకి చొరబడ్డాడు. 10 నిమిషాల పాటు ఇళ్ళంతా కలియతిరిగాడు. చోరీకి విశ్వ ప్రయత్నం చేశాడు.. కానీ ఏమీ దొరక్కపోవడంతో..చివరికి బైక్​ తాళం పగులకొట్టడానికి యత్నించాడు. ఎంతకీ తెరుచుకోకపోవడంతో తిరిగి ఒట్టి చేతులతో వెళ్లకూడదని అనుకున్నాడో ఏమో చివరికి ఒక జత బూట్లతో అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఉదయం లేచి చూసే సరికి ఇంట్లోని గృహోపకరణ వస్తువులు చిందర వందరగా పడి కనిపించడంతో.. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా 10 నిమిషాల పాటు గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో హల్ చల్​ ​చేస్తూ కనిపించాడు. దీనిపై యజమాని రాజ్​కుమార్ ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.