నీలోఫర్‌‌లో మూడ్రోజుల పసికందును వదిలేసిన్రు

మూడు రోజుల క్రితం పుట్టిన పసికందును అనాథలా వదిలేసి వెళ్లిన ఘటన హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు బాబును ఒక కవర్‌‌లో పెట్టి తీసుకొచ్చి.. ఆస్పత్రి ఆవరణలో వదిలేశారు. కొంత సమయానికి పసికందును గమనించిన అక్కడి సిబ్బంది.. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఆ చిన్నారికి పరీక్షలు చేయగా.. కామెర్లు (జాండిస్) ఉన్నట్లు తేలిందని వైద్యులు చెప్పారు. అలాగే పసికందుకు అంగవైకల్యం కూడా ఉందన్నారు. ఆ బాబుకు అవసరమైన చికిత్స చేస్తున్నామని అన్నారు. కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఆ చిన్నారిని ఎవరు వదిలి వెళ్లారనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

లంకలో సంక్షోభం: ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

మేక తోలుకు రంగేసి పులి చర్మం పేరుతో విక్రయం

గూగుల్ పేలో ట్యాప్ టు పే