నిద్రిస్తున్న చిన్నారిపై నుండి వెళ్లిన కారు.. మూడేండ్ల పాప మృతి

ఎల్​బీనగర్, వెలుగు : కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో మూడేండ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం బీఎన్​రెడ్డి నగర్​లోఉండే రాజు, కవిత దంపతులకు  కొడుకు బసవరాజు(6), కూతురు లక్ష్మి(3) ఉన్నారు. రాజు, కవిత హయత్​నగర్​లోని లెక్చరర్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద పనిచేస్తున్నారు.

బుధవారం కవిత తన కూతురు లక్ష్మిని ఆ భవనం వద్ద పడుకోబెట్టి పనులు చేస్తుండగా.. అటుగా వచ్చిన ఓ కారు డ్రైవర్ వెహికల్​ను రివర్స్ చేస్తూ నిద్రపోతున్న చిన్నారి తలపై నుంచి పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.