కాగజ్‌నగర్‌లో మహిళపై పులి దాడి

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం (నవంబర్ 29) ఉదయం మహిళపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలంలోని ఈస్ గాం విలేజీ నెంబర్ 11లో  ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ(21) చేనులో పత్తి ఏరడానికి వెళ్లింది. అకస్మాత్తుగా పులి ఆమెపై పడి దాడి చేసింది. దీంతో మోర్లే లక్ష్మీ తీవ్రంగా గాయపడ్డింది. చికిత్స కోసం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించినా ఫలితం దక్కలేదు. లక్ష్మీ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగజ్ నగర్ డివిజన్ అటవీ శాఖ కార్యాలయంలో ముందు బాధిత మహిళ మృతదేహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.