కొల్లాపూర్, వెలుగు: గత కొంతకాలంగా కృష్ణ పరివాహక ప్రాంతంలోని అమరగిరి పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఎఫ్ఆర్వో శరత్ చంద్రారెడ్డి తెలిపారు, కృష్ణ నది నుంచి సోమశిల, ఎల్లూర్, మొలచింతలపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు సీసీ పుటేజీలో రికార్డైనట్లు చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. జీవాలను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లవద్దని, పంట పొలాలకు కరెంట్ తీగలు వేయవద్దన్నారు. పులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.