Canada: పార్లమెంట్ నుంచి కుర్చీ తీసుకెళ్లిన ట్రూడో.. అధికారాలు అప్పగించి ఎందుకిలా చేశాడు..?

Canada: పార్లమెంట్ నుంచి కుర్చీ తీసుకెళ్లిన ట్రూడో.. అధికారాలు అప్పగించి ఎందుకిలా చేశాడు..?

కెనడాలో అధికార మార్పిడి జరిగింది. ఇటీవల లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మార్క్ కార్నీ కెనడా కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటి వరకు కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో అధికారాలను నూతన ప్రధాని కార్నీకి అప్పగించాడు. 

అధికార మార్పిడి సమయంలో కెనడా పార్లమెంటులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటు నుంచి వెళుతున్న టైం లో ట్రూడో కుర్చీ మోసుకెళ్తూ కనిపించడం చర్చనీయాంశం అయ్యింది. నాలుక  బైటకు పెట్టి కుర్చీ మోసుకుంటూ వెళ్తున్న ట్రూడో ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు తను కూర్చున్న చైర్ ను ట్రూడో తీసుకెళ్లినట్లు పొలిటికిల్ కాలమిస్ట్ బ్రయాన్ లిల్లీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అయితే పార్లమెంటు నుంచి చైర్ తీసుకెళ్లడమేంటి చీప్ గా అనే సందేహం చాలా మందికి రావచ్చు.

ALSO READ | రాబోయే రోజుల్లో టారిఫ్​లు పెరగొచ్చు ..మెక్సికో, కెనడాకు ట్రంప్ వార్నింగ్

కెనడా లా మేకర్లకు అంటే ప్రజా ప్రతినిధులకు పార్లమెంటు నుంచి తమ చైర్ ను తీసుకెళ్లే సదుపాయం ఉంటుందని బ్రయాన్ తెలిపాడు . ‘‘ఎవరైనా ఎంపీ పార్లమెంటును వీడుతున్నపుడు, పదవీ కాలం పూర్తైనపుడు తమ చైర్ తీసుకెళ్లవచ్చు. ఇది మంచి సంప్రదాయంగా నేను భావిస్తాను.’’ అని చెప్పుకొచ్చాడు. 

ట్రూడో పార్లమెంట్ ను వీడే ముందు గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి కీలక ప్రసంగం చేశాడు. ‘‘గత పదేండ్లుగా కెనడా భవిష్యత్ కోసం మేము తీసుకున్న నిర్ణయాలను, సాధించిన విజయాలను గర్వంగా చెప్పుకుంటున్నాం’’ అని ఎమోషనల్ అయ్యాడు. కెనడా కొత్త ఎరాలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా.. ఈ భూమిపైనే కెనడా అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేయాలని అన్నారు. కెనడా అభివృద్ధి కోసం అందరూ పోరాటా చేయాలని తన మద్ధతుదారులకు పిలుపునిచ్చాడు. ప్రధాన మంత్రి పదవితోపాటు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి జనవరి 6న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రూడో స్థానంలో కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ నియమితులయ్యారు. ఇవాళ (కెనడా కాలమానం ప్రకారం సోమవారం) కార్నీకి బాధ్యతలు అప్పగించాడు ట్రూడో.