ప్రణయ్ హత్య కేసు నిందితులు వీళ్లే..

ప్రణయ్ హత్య కేసు నిందితులు వీళ్లే..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన  ప్రణయ్ పరువు హత్య కేసులో ఏ2 నిందితుడికి ఉరిశిక్ష..మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ  మార్చి 10న  నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో మొత్తం నిందితులు 8 మంది ఉన్నారు. . A1 మారుతీరావు (అమృత తండ్రి) 2020లో ఆత్మ హత్య చేసుకున్నారు.   A2 సుభాష్ శర్మ(బిహార్), A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్), A8 నిజాం (ఆటో డ్రైవర్).  కరీం సాయంతో అస్గర్ కు సుఫారీ ఇచ్చాడు  మారుతీరావు 

 తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని 2018 సెప్టెంబర్ 14న పక్కా ప్లాన్ ప్రకారం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ హాస్పత్రి ప్రాంగణంలో  ప్రణయ్ ను హత్య చేయించాడు అమృత తండ్రి మారూతీ రావు.  మారుతీరావు సుపారీ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రణయ్ ను  హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి.. 1600 పేజీల్లో చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది.

Also Read :- ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష

 అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్థారించారు. 2019 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌12న చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దానిపై ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు ఐదు సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా.. పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ సమర్పించిన చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు సాక్షులను న్యాయస్థానం విచారించి మార్చి 10న తుది తీర్పునిచ్చింది.

మరో వైపు తన తండ్రి  ఏ తప్పు చేయలేదని అమృత చిన్ననాన్నశ్రావణ్ (ఏ 6) కుమార్తె కోర్టు దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది. అమృత వల్లే ఇదంతా జరిగిందని..తన తండ్రిని ఇరికించారని ఆరోపించింది. ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కు కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి  తెలిసిందే.