స్పోర్ట్స్ కోటాలో 96 మంది టీచర్ల ఎంపిక.. వారం రోజుల్లో పోస్టింగ్లు ఇవ్వనున్న విద్యాశాఖ

స్పోర్ట్స్ కోటాలో 96 మంది టీచర్ల ఎంపిక.. వారం రోజుల్లో పోస్టింగ్లు ఇవ్వనున్న విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ– 2024లో స్పోర్ట్స్ కోటా కింద మరో 96 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రానున్నాయి. వారం రోజుల్లో వారికి అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో స్పోర్ట్స్ పోస్టింగుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో రెండుసార్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించారు.

393 మంది అభ్యర్థుల వివరాలను సాట్స్ అధికారులు వెరిఫికేషన్ చేశారు. ఈ క్రమంలో సాట్స్ అధికారులు సోమవారం సెలెక్షన్ లిస్టును స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు అందించారు. దీంట్లో కొత్తగా 96 మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీంతో పాటు గతంలో ఉద్యోగాలు పొందిన 9 మందిని టీచర్ కొలువుల నుంచి తప్పించనున్నారు.