పిల్లల ఊహా శక్తిని పెంచే టాయ్​ ప్రొజెక్టర్​

పిల్లల ఊహా శక్తిని పెంచే టాయ్​ ప్రొజెక్టర్​

పిల్లలకు ఏదైనా కొత్త విషయాన్ని నేర్పించాలంటే.. కొత్తగానే చెప్పాలి. లేదంటే.. ఇలా విని అలా మర్చిపోతారు. ముఖ్యంగా మూడు.. నాలుగేండ్ల  పిల్లలకు పండ్లు, జంతువులు ఎలా ఉంటాయో నేర్పించేందుకు ఇలాంటి టాయ్​ ప్రొజెక్టర్లను వాడితే బెటర్​. దీంతో ప్రొజెక్ట్‌‌ చేసి చూపిస్తే.. సరదాగా అనిపించడంతో బాగా గుర్తుపెట్టుకుంటారు. 

దీన్ని ది లిటిల్​ వన్స్​ కంపెనీ అమ్ముతోంది. ఈ ప్యాక్​లో 6 ప్రొజెక్షన్ డిస్క్​లు కూడా వస్తాయి. వాటితో.. మొత్తం 48 యానిమేటెడ్ బొమ్మలను ప్రొజెక్ట్‌‌ చేయొచ్చు. స్పేస్, డైనోసార్, జంతువులు, సంఖ్యలు, ఫుడ్స్​, వెహికల్స్​.. ఇలా రకరకాల బొమ్మలు ఉంటాయి. ఇది పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తి, ఊహాశక్తిని పెంచడంలో సాయం చేస్తుంది. దీన్ని హై క్వాలిటీ ఏబీఎస్​ ప్లాస్టిక్​తో తయారుచేశారు. 50 నుంచి 150 సెంటీమీటర్ల వరకు ఇది లైట్​ని ప్రొజెక్ట్‌‌ చేస్తుంది. 

ధర
589