సూర్యాపేట జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళలు మృతి

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెరువు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ముత్యాలమ్మ పండుగలో భాగంగా వనవాసంకు పోయి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

మృతిచెందిన వారిలో బిల్లా మనిషా, చంద్రమ్మ ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడ్డ నలుగురిని హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ALSOREAD: ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో చెలరేగిన మంటలు

ట్రాక్టర్ బోల్తా పడడానికి కారణం ఏంటన్నదానిపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు.