ఇస్తాంబుల్​లో ఘోర అగ్నిప్రమాదం..29 మంది మృత్యువాత

  • మరో పదిమందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

ఇస్తాంబుల్: తుర్కియే రాజధాని ఇస్తాంబుల్​లో ఘోరం జరిగింది.  నగరంలోని ఓ నైట్​ క్లబ్​లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరగ్గా.. 29 మంది మృత్యువాతపడ్డారు. మరో పది మంది గాయాలపాలయ్యారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  వివరాల్లోకెళితే.. పునర్నిర్మాణంలో ఉన్న 16 అంతస్తుల బిల్డింగ్​లోని బేస్​మెంట్​లో మాస్వ్కెరేడ్ నైట్ క్లబ్ ఉన్నది. బిల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. 

ఈ భారీ అగ్ని ప్రమాదంలో 29మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది బిల్డింగ్​ పునర్నిర్మాణ పనుల్లో ఉన్నవారేనని సమాచారం. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలను అర్పివేశాయి. క్లబ్ యజమానితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇస్తాంబుల్ గవర్నర్ దావత్ గుల్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.