దోమల కాయిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు.. పాపం.. హయత్ నగర్లో ఎంతపనైందో చూడండి..!

దోమల కాయిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు.. పాపం.. హయత్ నగర్లో ఎంతపనైందో చూడండి..!

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో విషాద ఘటన జరిగింది. దోమలు ఎక్కువగా ఉండడంతో ఇంట్లో పరుపు మీద దోమల కాయిల్ పెట్టి పడుకున్నారు. అయితే ఆ దోమల కాయిల్ దురదృష్టవశాత్తూ కిందపడడంతో ప్రమాదం జరిగింది. కాయిల్ కిందపడి పరుపుకి అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఊపిరాడక రెహమాన్‌(4) అనే బాలుడు మృతి చెందాడు. మరో బాలిక ఫాతిమా (5) పరిస్థితి విషమంగా ఉంది. బాలికను నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దోమల బారినుంచి బయటపడటానికి జెట్​కాయిల్స్, లిక్విడ్స్​వాడుతుంటారు. కానీ.. వాటి తయారీలో వాడిన రసాయనాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దోమల కాయిల్స్,  ఇతర మందులకు కొత్తలో కాస్త ఫలితం ఉంటున్న ఆ తర్వాత వీటికి అవి అలవాటు పడిపోతున్నాయి. దీంతో ఎన్ని దోమల మందులు వాడినా ఫలితం ఉండటం లేదు.

దోమల నివారణకు వాడే కాయిల్స్, స్ప్రేలు, లిక్విడ్స్, రెపెల్లెంట్స్ ఏదైనా సరే.. పిల్లలు గదిలో లేనప్పుడే వాడాలి. ఒకవేళ పిల్లలు ఇంట్లో ఉంటే గదిలో కాకుండా ఎంట్రన్స్లో పెట్టాలి. దీని వల్ల దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. పరుపు దగ్గర పెట్టడం వల్ల ఎంత ఘోరం జరిగిందో ఈ ఘటన చెప్పకనే చెప్పింది.

►ALSO READ | Seema Haider:‘‘నేను ఇండియా కోడల్ని ఇక్కడే ఉండనివ్వండి’’.. ప్రధాని మోదీకి సీమాహైదర్ రిక్వెస్ట్

మస్కిటో కాయిల్స్​ వల్ల చిన్నపిల్లల్లో ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  పిల్లలు పొరపాటున కాయిల్ని మింగితే పాయిజన్​అవుతుంది. కాలుతున్నప్పుడు వాటిని ముట్టుకుంటే గాయాలు అవుతాయి. వేపరైజర్​నుంచి వచ్చే రసాయనాలు​ కూడా పిల్లల్లో ఆస్తమా, తలనొప్పికి కారణమవుతాయి. లిక్విడ్​ వేపరైజర్, లిక్విడ్​​ స్ప్రేలోనూ సువాసనతో పాటు ప్రల్లెథ్రిన్ అనే పెస్టిసైడ్​ ఉంటుంది.

లిక్విడ్​వేపరైజర్, మస్కిటో కాయిల్​పెట్టిన కొంచెం సేపటికే  కొందరికి తలనొప్పి వస్తుంది. కళ్లు మండుతాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. చర్మం మీద దద్దుర్లు కూడా వస్తాయి. కొందరు ఆ వాసన, పొగ పడక వాంతి చేసుకుంటారు కూడా.