మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం విషదరమైన ఘటన చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలో 50 ఏళ్లనాటి గోడ కూలి 8 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. షాజాపూర్లోని హర్దౌల్ ఆలయంలో పార్థివ్ శివలింగాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఆలయం పక్కనే ఉన్న ఓ ఇంటి గోడ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడే ఉన్న పిల్లలపై పడింది. చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. జేసీబీతో ద్వంసమైన గోడ శిథిలాలు తొలగించి.. మృతదేహాలను వెలికి తీస్తున్నారు.