అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. భారీ వర్షానికి రామాయంపేట పరిధిలో చెట్టు కొమ్మ విరిగిపడి ఓ మహిళ మృతి చెందింది.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన నీల పద్మ దంపతులు ( 38) బైక్ పై వెళ్తుండగా...తలపై చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంత తీవ్రంగా గాయపడిన నీల పద్మను హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ పద్మ మృతి చెందింది . రామాయంపేట నుంచి స్వగ్రామమైన బాగిర్తిపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.