ఘట్కేసర్ వెలుగు: ఆటోపై చెట్టు విరిగిపడటంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలైన ఘటన ఘట్ కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి -భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం, మక్తా అనంతారంకు చెందిన మునుకుంట్ల పెంటయ్య (60) ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడు.
అదే గ్రామానికి చెందిన ఓ ప్రయాణికురాలిని ఆటోలో ఎక్కించుకొని భువనగిరికి వెళ్లుతుండగా ఘట్కేసర్లోని మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తు చెట్టు ఆటోపై పడింది. ఈ ఘటనలో పెంటయ్యకు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికురాలికు స్వల్పగాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.