ఎన్నికల కోసం మంచుకొండల్లో అధికారుల యాత్ర

ఎటు చూసినా  కొండలే. ఈ కొండల మధ్యలో పారే సెలయేళ్లు. సెలయేళ్లకు దగ్గరలో అక్కడక్కడా విసిరేసినట్లేం ఊళ్లు..సర్కారు రికార్డుల్లో ఊరుగా నమోదైనా జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అంత చిన్నగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా కొండ ప్రాంతం. ఈ రాష్ట్రంలో రెండు అరుణాచల్ ప్రదేశ్ (వెస్ట్), అరుణాచల్ప్రదేశ్ (ఈస్ట్) లోక్‌‌‌‌సభ నియోజక వర్గాలున్నా యి. మొదటి విడతలోనే ఈ రెండు స్థానాలకు గురువారం(ఈ నెల11) పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్ని కలు నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది టీంలు నాలుగో తేదీనే బయల్దేరాయి. పోలింగ్ స్టేషన్లు చేరుకోవడానికి సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నా రు. కొండల మధ్యన నడుస్తూ పోలింగ్ స్టేషన్లకు ప్రయాణమయ్యారు. పోలింగ్ స్టేషన్లు పెట్టిన చోటుకు కార్లు, వ్యాన్లువెళ్లవు. అవే కాదు స్కూటర్లు, బైక్‌‌‌‌లకు కూడా నో చాన్స్. దీంతో నడకనే నమ్ముకున్నారు. రెండు మూడు గంటలనడక తర్వాత కాసేపు రెస్ట్. మళ్లా నడక మొదలు. కొన్ని సార్లు సెలయేళ్లు దాటాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్ల కాలువలు అడ్డొస్తాయి. బోటు సాయంతో అవతలపక్కకు సిబ్బంది చేరుకుంటారు.పోలింగ్ మెటీరియల్‌‌‌‌ని భుజాన మోసుకుని మైళ్లకుమైళ్లు నడుస్తున్నా రు. ప్రతి పోలింగ్ టీంకి సాయంగా కొంతమంది పోర్టర్లను సర్కారు ఇచ్చిం ది. ఈవీఎంలు,వాటికి అనుసంధానంగా ఉండే వీవీప్యా ట్‌ లు ఇతరపోలింగ్ మెటీరియల్‌‌‌‌ని జాగ్రత్తగా సంచుల్లో ప్యాక్ చేసుకుని పోర్టర్లు మోస్తుంటారు.

పోలింగ్ జరిగేది11వ తేదీ అయినా ఒకరోజు ముందుగానే సంబంధిత స్టేషన్‌ కి చేరుకునేలా ప్లాన్ చేశారు. అంతా కొండల ప్రాంతం కాబట్టి ఏమాత్రం రిస్క్  చేసినా, పోలింగ్ రోజుకి చేరుకోవడం కష్టమవుతుందన్నది సిబ్బంది అలోచన. అందుకే ఒక రోజుముందుగానే స్టేషన్‌ కి చేరుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. పోలింగ్ మెటీరియలే కాకుండా ఆహార పదార్థాలు కూడా వెంట తీసుకెళుతున్నారు. బియ్యం, కూరగాయలు, స్టవ్ వగైరాలన్నీ ప్యాక్ చేసిన సంచుల్లో ఉంటాయి. ఎక్కడ వీలైతే అక్కడ వంట చేసుకుంటారు. తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లాన డక ప్రారంభిస్తారు. సాధ్యమైనంతవరకు రాత్రిళ్లు,వాకింగ్‌‌‌‌కి రెస్ట్ ఇస్తారు. ఊరి పొలిమేరల్లో ఉండే చిన్నచిన్న షెడ్లలో నైట్ గడిపేస్తారు. ఈసారి పోలింగ్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయిన వారిలో ఎక్కువమంది ఇంజనీర్లు. ఊరి జనానికి ఉపయోగపడే ఏదో ఒక పని కోసంతరచూ నడుచుకుంటూ గ్రామాలకు రావడం వీరికిఅలవాటే. ఈ కారణంతోనే వీరిని పోలింగ్ ఆఫీసర్లుగా సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు ఎన్ని కల సంఘం అధికారులు.

2014 లోక్‌‌‌‌సభ ఎన్ని కల్లో సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఎలక్షన్డ్యూటీ చేసినవారిని గుర్తించి ఈసారి కూడా వాళ్లకేడ్యూటీ వేశారు. అప్పట్లో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా (ఏపీఓ) ఉన్నవారిలో కొంతమందికి ఈ సారిపోలింగ్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇచ్చారు.కిందటిసారి లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో కూడా సిబ్బంది ఇలాగే కష్టపడ్డారు. ఈసారి కష్టాలు కాస్తంత తగ్గాయని చెప్పవచ్చు. ఎందుకంటే పోలింగ్ సిబ్బందిని ఎయిర్ ఫోర్స్ ఆదుకుంది. 32 మంది సిబ్బంది ఉన్ననాలుగు టీంలను ఐఏఎఫ్ హెలికాఫ్టర్లు కొంతవరకు తీసుకెళ్లి దించా యి. అక్కడ నుంచి సిబ్బంది నడకదారిపట్టారు. ఏమైనా లోక్‌‌‌‌సభ ఎన్నికలు సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నిర్వహించడానికి అరుణాచల్ ప్రదేశ్ ఉద్యో గులు నానాకష్టాలు పడుతున్నారు.

మంచులో పోలింగ్ సిబ్బంది నడక

అరుణాచల్ ప్రదేశ్‌ లోని లడాక్ హాంబోటింగ్ లా పాస్ పూర్తిగా మంచు కురిసే ప్రాంతం. నిత్యం అక్కడ మంచు కురుస్తూనే ఉంటుంది. చుట్టు పక్కల కొండలన్నీ మంచుతో ఉంటాయి. ఈ కొండల్లో పోలింగ్ సిబ్బంది చేతుల్లో ఈవీఎంలు, మిగతా మెటీరియల్ మోసుకుంటూ నడుచుకుంటూ పోవాల్సిఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌ లో పోలింగ్ సిబ్బంది ఎంపికే డిఫరెంట్‌ గా ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌ నెస్‌‌‌‌కి టాప్ ప్రయారిటీ ఇస్తారు. సాధ్యమైనంత వరకు 40 ఏళ్లలోపు వారినే సిబ్బందిగా సెలెక్ట్ చేసుకుంటారు. అంతేకాదు ఏ ఊరు ఎక్కడ ఉందో తెలిసినవాళ్లకు ప్రయారిటీ ఇస్తారు. వీటన్నిటికి మించి ఎన్ని కల
నిర్వహణలో అనుభవం ఉన్నవారికి సెలెక్షన్‌ లో ప్రాధాన్యం ఇచ్చారు.