పొలం పనులకు వెళ్తుండగా బ్రిడ్జి పై నుంచి కింద పడ్డ ట్రాలీ ఆటో

పొలం పనులకు వెళ్తుండగా బ్రిడ్జి  పై నుంచి కింద పడ్డ ట్రాలీ ఆటో

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ శివారున పెద్దవాగు వంతెన పై నుంచి కూలీల ట్రాలీ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. 

మొక్కజొన్న చేను పనికి చీపురుగూడెం నుంచి  గుండెపూడి గ్రామానికి ట్రాలీలో 20 మంది కూలీలు వెళుతుండగా పెద్దవాగు వంతనె దగ్గర ఆటో అదుపు తప్పడంతో    ఈ  ప్రమాదం జరిగింది.వే సవి కాలం కావడం పెదవాగులో నీరు లేకపోవడంతో కూలీలకు ప్రాణాపాయం తప్పింది. స్థానికుల సమాచారం ఘటనా స్తలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.