అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ట్రక్కు..ఇద్దరు మృతి

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్బుల్ లోడుతో నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. మృతులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.