హైదరాబాద్: న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు రానున్న నేపథ్యంలో ఆర్టీసీ సరికొత్త ప్రచారం చేపట్టింది. ప్రయాణికులను సంస్థ వైపు ఆకర్షించేందుకు వినూత్నంగా ఓ వీడియోను రూపొందించింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్న అయ్యయ్యో వద్దమ్మా అనే మీమ్ ను వాడుతూ.. బస్సు ప్రయాణం సురక్షితం అనే థీమ్ తో తయారు చేసింది. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. పండుగ వేళల్లో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని సజ్జనార్ ప్రజలను కోరారు.
అయ్యయ్యో అధిక చార్జీలు వద్దమ్మా! తక్కువ ధరలో శుభప్రదమైన సుఖవంతమైన ప్రయాణం #TSRTC బస్సు తో నే సాధ్యం. #UPI యూపీఐ ద్వారా మీ పేమెంట్లు చెల్లించి టికెట్ పొందగలరు సుఖీభవ సుఖీభవ!
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 29, 2021
బుకింగ్ కోసం https://t.co/Scvhc61E01#TravelWithTSRTC @TSRTCHQ @NtvTeluguLive @HiHyderabad @tinucherian pic.twitter.com/Vgz1g6JUXk
అధిక చార్జీల బాధ నుంచి తప్పించుకపోవడానికి.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడమే ఉత్తమ మార్గమని సజ్జనార్ చెప్పారు. ‘అయ్యయ్యో వద్దమ్మా. తక్కువ ధరలో సుఖవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుతోనే సాధ్యం. యూపీఐ ద్వారా మీ పేమెంట్లు చెల్లించి టికెట్ పొందండి. సుఖీభవ’ అనే క్యాప్షన్ ను సజ్జనార్ తన ట్వీ్ట్ కు జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వార్తల కోసం: