సెలబ్రిటీ రిసార్ట్‫లో ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్

సెలబ్రిటీ రిసార్ట్‫లో ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్

సొంత కూతురినే కిడ్నాప్ చేసేందుకు సిదార్థ్ దాస్ ప్రయత్నించారని ఆయన భార్య ఆరోపించారు. ఈమేరకు ఆమె ఈరోజు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. గొడవల కారణంగా భార్యభర్తలు సిద్దార్థ్ దాస్, స్మితా వేరువేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గతంలో సీరియల్ యాక్టర్ మనోజ్ రిసార్ట్ లో సిర్ధార్థ్ దాస్ పై ఎయిర్ గన్ తో కాల్పులు జరిపారు. స్మిత, మనోజ్ తో కలిసి ఉంటుంది. ఈ వివాదంపై అప్పట్లో వార్తలు వచ్చాయి. 

అయితే తాజాగా స్మితా సిద్దార్థ్ దాస్ స్నేహితుడు అడ్వకేట్ అలీ తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డీజీపీకి ఫిర్యాదు చేశారు. సిర్ధార్థ్ నకిలీ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ను స్కూల్ వద్దకు పంపి ఆమె కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్మిత డిమాండ్ చేశారు. ఆమె ఫిర్యాదుని స్వీకరించి దర్యాప్తు చేయాలని సిఐడీ ఛీఫ్ శిఖా గోయల్ ను డీజీపీ ఆదేశించారు.