హైదరాబాద్: బాచుపల్లిలోని కౌసల్యా కాలనీకి చెందిన కె.మహేశ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తన బైక్ అమ్ముతానని జనవరి 23న ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన రమేశ్ బాబు.. మహేశ్ ఇంటికి వెళ్లి.. టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి బైక్ తీసుకుని పారిపోయాడు. పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
చోరీ చేసిన బైక్పై తిరుగుతున్న రమేశ్ బాబు, గుండప్పను అదుపులోకి ప్రశ్నించగా.. నర్సింహతో కలిసి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి నుంచి రూ.4 లక్షలు విలువ చేసే 6 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నర్సింహ కోసం వెతుకుతున్నారు. వీళ్లు బాచుపల్లి పరిధిలో3 బైక్లు, మియాపూర్, కేపీహెచ్బీ, జగద్గిరిగుట్ట పరిధిలో ఒక్కో బైక్ చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ గ్యాంగ్ దందా సాగిందిలా..
ఓఎల్‌ఎక్స్ యాప్ను వాడుకుని టెస్ట్ డ్రైవ్ పేరుతో బైక్లు దొంగలిస్తున్న ముఠాను హైదరాబాద్లోని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ సోమవారం వెల్లడించారు.
గుంటూరు జిల్లా సంతగూడిపాడుకి చెందిన ఒంగోలు రమేశ్ బాబు అలియాస్ వినోద్ (27), వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఇండర్చెడ్ గ్రామానికి చెందిన చంద్రమౌలు గుండప్ప అలియాస్ అర్జున్ (24) బతుకుదెరువుకోసం హైదరాబాద్ వచ్చి సూరారంలో ఉంటున్నారు.
రమేశ్ బాబు, 2018లో హైదరాబాద్ సిటీకి వచ్చి ట్రాన్స్ జెండర్ తో నివాసం ఉన్నాడు. ఎదురింట్లో ఉండే గుండప్ప, అతని బావమరిది నర్సింహతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ముగ్గురూ కలిసి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచిన బైక్లను టెస్ట్ డ్రైవ్ పేరుతో దొంగలించి పారిపోయేవారు.