- మహబుబాబాద్ జిల్లా కలకత్తా తండాలో ఘటన
గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కలకత్తా తండాలో నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు చనిపోయాడు. తండాకు చెందిన వాంకుడోతు సురేశ్, స్నేహా కొడుకు దేవంత్(2) బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఎవరూ గమనించకపోవడంతో ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి పోయాడు. ఆ టైంలో స్నేహ ఇంట్లో తన కూతురును ఆడిస్తూ ఉంది.
చాలాసేపటి తర్వాత కొడుకు దేవంత్ కనిపించకపోవడంతో వెతికారు. చివరకు సంపులో పడి ఉండడంతో బయటకు తీసి గూడూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.