రెండేళ్ల బాలుడిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి వీధి కుక్కల దాడి (వీడియో)

రెండేళ్ల బాలుడిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి వీధి కుక్కల దాడి (వీడియో)

హైదరాబాద్ లో ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల బాలుడిపై ఆదివారం వీధి కుక్కలు దాడి చేశారు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణా ప్రతాప్ నగర్‌లో బాలుడు ఇంటి ముంగిట ఆడుకుంటున్నాడు. కుక్కలు తన వైపుకు వీధి కుక్కలు రావడం చూసి భయపడి బాలుడి ఇంట్లోకి పరుగెత్తాడు. అయినా కూడా కుక్కలు బాలుడిని ఇంటో నుంచి లాక్కొచ్చి దాడి చేయడం ప్రారంభించాయి.

ఒక్కసారిగా నాలుగు శునకాలు బాలుడిపై విరుచుకుపడ్డాయి. బాబు ఏడుపు విని ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడుకి తీవ్ర గాయాలు కావడంతో లకిడికపూల్ లోని నీలోఫర్ హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.