ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

  •     పీడీఎస్​యూ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్స్ తో స్టూడెంట్స్​ నిరసన
     

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం జిల్లా కేంద్రంలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్​ఆధ్వర్యంలో స్టూడెంట్స్​ నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి సమస్య చేరేలా సిటీలోని కేయూ సబ్ క్యాంపస్ లో స్టూడెంట్స్ పోస్టు కార్డ్స్ తో నిరసను తెలియజేశారు.

ఈ సందర్భంగా వెంకటేశ్​ మాట్లాడారు. కొత్తగూడెం కేంద్రంగా మైనింగ్ యూనివర్సిటీ, భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ,  ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యూనివర్సిటీల ఏర్పాటుకు గత 40 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టంచుకోవడంలేదని వాపోయారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ లీడర్లు గోపి, వినయ్, అనూష, అఖిల, సురేశ్, శ్రీకాంత్, ప్రియా, పృథ్వి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.