స్పోర్ట్స్ సిటీగా హనుమకొండ

స్పోర్ట్స్ సిటీగా హనుమకొండ

హనుమకొండ, వెలుగు : స్వల్ప వ్యవధిలోనే హనుమకొండ మంచి ప్రగతిని సాధిస్తూ స్పోర్ట్స్ సిటీగా అవతరిస్తోందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.వాణీప్రసాద్ అన్నారు. హనుమకొండ జేఎన్​ఎస్​ స్టేడియం అభివృద్ధి పనులతోపాటు స్పోర్ట్స్ ఎంపిక పోటీలను శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం శిథిలావస్థలోని బాలికల హాస్టల్​ ను పరిశీలించి

కొత్త బిల్డింగ్ ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని డీవైఎస్​వో అశోక్ కోరారు. యువజన శాఖ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆమె సందర్శించారు. టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ సూపరింటెండెంట్ మహ్మద్ నయీమ్ తదితరులు ఆమె వెంట ఉన్నారు.