
ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పెనుకొండ దగ్గర నేషనల్ హైవేపై చిరుత పులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం ఎప్పడు జరిగిందనే తెలియాల్సి ఉంది. చిరుత మెడకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపైనే తీవ్రగాయాలతో రక్తపు మడుగులతో చిరుత పడి ఉంది. కొన ఊపిరితో చిరుత పులి కొట్టుమిట్టాడుతోంది.
రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు చిరుతను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిరుత కోలుకుంటుందని చెప్పారు. ఇటీవల చిరుతలు గ్రామాల్ల సంచరిస్తున్నాయి. తరచూ రోడ్లపై తిరుగుతుండటంతో ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నాయి.