
జీడిమెట్ల, వెలుగు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 67 పెండింగ్చలాన్లు ఉన్న బైక్ను జీడిమెట్ల ట్రాఫిక్పోలీసులు పట్టుకున్నారు. అందులో 51 చలాన్లు ‘విత్అవుట్ హెల్మెట్’వి అని గుర్తించారు. అలాగే ట్రిబుల్ రైడింగ్చలాన్లు 5, రాంగ్ సైడ్డ్రైవింగ్చలాన్లు 10, పాదచారులకు ఇబ్బంది కలిగించినందుకు ఒక చలాన్ఉన్నాయి. వాహనదారుడికి ట్రాఫిక్సీఐ శ్రీనివాస్కౌన్సిలింగ్ఇచ్చి హెల్మెట్అందజేశారు. 51 చలాన్లను క్లియర్ చేయించారు.