సింహం బోనులోకి సెల్ఫీ కోసం వెళ్లాడు.. కొరికి చంపిన లయన్

సింహంతో ఆటలు వద్దు.. సింహాన్ని చూడాలనుకో పర్వాలేదు.. దానితో ఆడుకోవాలంటే చావును కొనితెచ్చుకోవటమే.. ఇది పచ్చి నిజం. ఇది తెలిసినా.. సెల్ఫీ పిచ్చితో.. సింహంతో సెల్ఫీ కోసం అందులోకి దూకి.. చావును కొనితెచ్చుకున్నాడు ఓ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జూలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే...

తిరుపతి నగర శివారులోని ఎస్వీ జూపార్క్ లో సందర్శన కోసం వచ్చిన ఓ వ్యక్తిపై సింహం కౄరంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడి కక్కడే మృతిచెందాడు. సెల్ఫీ దిగడం కోసం నిబంధనలు ఉల్లంఘించిన ఎన్ క్లోజర్ లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరిని బయటికి పంపించేశారు. జూలోనిక సందర్శకులను సైతం అనుమతి నిరాకరించారు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

సింహం దాడికి ముందు సింహం దాడి నుంచి తప్పొంచుకునేందుకు ఆ యువకుడు చెట్టు ఎక్కాడని అక్కడి చూసిన వారు చెబుతున్నారు. మెడపై కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.