ఖైరతాబాద్ ఐమ్యాక్స్ దగ్గర దారుణం.. అడ్వకేట్ ని కత్తులతో పొడిచి, ఫోన్ తీసుకెళ్లారు

ఖైరతాబాద్‌లో  మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర వాకింగ్ చేస్తున్న న్యాయవాది కళ్యాణ్ పై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు. కళ్యాణ్ చేతిలో ఉన్న ఫోన్ ఎత్తుకెళ్లారు. కత్తులతో పొడిచి ద్విచక్ర వాహనంపై పారిపోయిన దుండగులు. అడ్వకేట్ కళ్యాణ్ చేతికి గాయాలు అయ్యాయి. ఖైరతాబాద్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ దొంగిలిస్తున్న ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు.