
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో ఏరియాలోని గనులపై శుక్రవారం బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. ఆర్కే న్యూటెక్ గనిపై నిర్వహించిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించినందుకు కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల సమస్యలు తెలుసుకుని, మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. లీడర్లు శంకర్ రావు, కలవేణ శ్యామ్, గరిగ స్వామి, తిరుపతి రెడ్డి, శ్రీను, గణపతి మహేశ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.