చెస్‌‌‌‌‌‌‌‌ హీరోలకు గ్రాండ్ వెల్‌‌‌‌‌‌‌‌కం

చెస్‌‌‌‌‌‌‌‌ హీరోలకు గ్రాండ్ వెల్‌‌‌‌‌‌‌‌కం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌/చెన్నై : ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో రెండు గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో చరిత్ర సృష్టించి స్వదేశానికి తిరిగొచ్చిన ఇండియా ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. బుడాపెస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి  మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో దిగిన విమెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌ లీడర్ ద్రోణవల్లి హారికకు 

తెలంగాణ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎస్‌‌ ప్రసాద్‌‌, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. మరోవైపు డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌, ప్రజ్ఞానంద, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వైశాలి, మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌ నారాయణన్ చెన్నై చేరుకున్నారు. వారిని అధికారులు, అభిమానులు రిసీవ్ చేసుకున్నారు.