నవీన్ రెడ్డికి గజమాలతో స్వాగతం

నవీన్ రెడ్డికి గజమాలతో స్వాగతం

షాద్ నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డికి పార్టీకి షాద్​నగర్​లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ క్రేన్ సహాయంతో గజమాలతో ఆయనను సన్మానించారు. ఈ సందర్బంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గెలుపు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బీఆర్ఎస్  విజయం సాధించడం శుభ సూచకమన్నారు.