
బోథ్, వెలుగు : బోథ్ మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన సుద్దుల మనోహర్‌రెడ్డి ఆర్మీలో సేవలందించి పదవీ విరమణ పొంది గ్రామానికి రాగా గురువారం ఆయనకు గ్రామ యువకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దేశం కోసం కుటుంబాన్ని వదిలి సరిహద్దులో 16 సంవత్సరాల పాటు సేవలందించి తిరిగి రావడంతో ఆయన్ని గ్రామస్థులు అభినందించి సన్మానం చేశారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.