ధర్మారంలో వివేక్​ వెంకటస్వామికి ఘన స్వాగతం

పెద్దపల్లి, వెలుగు :  పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి మొదటిసారి వచ్చిన కాంగ్రెస్​  సీనియర్ ​నేత, చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్ వెంకటస్వామికి శనివారం కాంగ్రెస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చెన్నూర్​ నుంచి హైదరాబాద్​కు వెళ్తూ ధర్మారం చేరుకున్న వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్​ లీడర్లు ఘనంగా ఆహ్వానం పలికి శాలువాలు, బొకేలతో సన్మానించారు. 

అనంతరం  ధర్మారం మండల కేంద్రంలో నాలుగు రోజుల కింద అనారోగ్యంతో చనిపోయిన ఎలగందుల రాజేశం కుటుంబ సభ్యులను వివేక్​పరామర్శించారు.  కార్యక్రమంలో లీడర్లు కాడే సూర్యనారాయణ, దేవి జనార్ధన్, వేణుమాధవ్, రుప్లా నాయక్, నర్సింహులు, రాజేశంగౌడ్, మనోహర్ రెడ్డి, స్వామి, దేవి కిశోర్, అష్రఫ్ అలీ, ఎల్లయ్య, తిరుపతి, చంద్రయ్య, శ్రీనివాస్, తిరుపతియాదవ్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిరుపతి రావు, గంగయ్య, తిరుపతి నాయక్ పాల్గొన్నారు.