
రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ దగ్గర వాటర్ ట్యాంకర్ ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువతీ యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. రోడ్డుపై కారు ఆపి యువతీ యువకుడు సెల్ఫీలు తీసుకుంటుండగా వాళ్లపై ట్యాంకర్ దూసుకెళ్లింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి వచ్చిన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన ప్రతాప్ కుమార్ గా గుర్తించారు.