
నటుడు శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ ‘90s’. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్‌లైన్. నవీన్ మేడారం సమర్పణలో రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ టీజర్‌ను వెంకటేష్ లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక టీజర్ విషయానికొస్తే..90వ దశకంలోని జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ టీవీలో ‘మనోరంజని’ కార్యక్రమాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది.
శివాజీ మిడిల్ క్లాస్ ఫాదర్, స్కూల్ టీచర్‌గా కనిపిస్తుంటే, అతని భార్య పాత్రలో వాసుకి నటించారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మిడిల్ క్లాస్ కష్టాలను, ఆనందాలను చూపించారు. సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ప్లెజెంట్‌గా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.