కోలార్: కర్నాటకలోని కోలార్ జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం పెళ్లి చేసుకున్న జంట మధ్యాహ్నానికి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఈ గొడవలో పెళ్లి కూతురు చనిపోగా, పెళ్లి కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కోలార్ జిల్లాలోని కేజీఎఫ్ తాలూకాలోని చంబరసనహళ్లిలో ఈ ఘటన జరిగింది. పెళ్లి కూతురు లిఖితశ్రీ స్వస్థలం ఆంధ్రాలోని బైనపల్లి కాగా, పెళ్లి కొడుకు సొంతూరు చంబరసనహళ్లి కావడం గమనార్హం. అసలేం జరిగిందదంటే.. నవీన్, లిఖితశ్రీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో బుధవారం ఉదయం పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి తంతులో భాగంగా లిఖితశ్రీకి నవీన్ అరుంధతి నక్షత్రం చూపించాడు. సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. అయితే.. ఏం జరిగిందో తెలియదు.. పెళ్లయిన కొన్ని గంటల తర్వాత లిఖితశ్రీ, నవీన్ ఒక రూంలోకి వెళ్లారు.
ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో, ఎందుకంత కోపోద్రేకానికి లోనయ్యారో తెలియదు గానీ ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఈ ఇద్దరినీ కేజీఎఫ్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ లిఖితశ్రీ చనిపోయింది. నవీన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి సంతోషంగా చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే గదిలోకి వెళ్లాక ఏం జరిగిందో తెలియదు. ఉదయం పెళ్లి చేసుకుని మధ్యాహ్నానికి పెళ్లి కూతురు మర్డర్ అయిపోగా, పెళ్లి కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ ఇద్దరి మధ్య అసలు ఏ విషయంలో గొడవ జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.