- ఇష్టం లేదని పోలీసులకు ఫోన్ చేసిన యువతి
వికారాబాద్, వెలుగు: గంటలో పెండ్లి అనగా, తనకు ఆ వివాహం ఇష్టం లేదని ఓ యువతి పీఎస్ కు ఫోన్ చేసింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు పెద్దలు పెండ్లి మూహుర్తం ఖరారు చేశారు. అందరూ ఏర్పాట్లలో ఉండగా, తనకు ఈ పెండ్లి ఇష్టం లేదని యువతి బంట్వారం పీఎస్కు ఫోన్ చేసింది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పెండ్లిని అడ్డుకున్నట్లు ఎస్ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు. అమ్మాయి మేజర్ అయినందున బలవంతంగా పెండ్లి చేయవద్దని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.