ఒక్క వాట్సాప్ కాల్..నెలరోజులుగా డిజిటల్ అరెస్ట్.. రూ.4కోట్లు కొట్టేశాడు

ఒక్క వాట్సాప్ కాల్..నెలరోజులుగా డిజిటల్ అరెస్ట్.. రూ.4కోట్లు కొట్టేశాడు

ఒకే ఒక్క వాట్సాప్ కాల్..ఐపీఎస్ ఆఫీసర్లమంటూ వృద్దురాలికి బెదిరింపులు..మీ పేరున థైవాన్ నుంచి ఓ కొరియర్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. నీవు జైలు వెళ్లక తప్పదంటూ రోజుల తరబడి మానసికంగా టార్చర్..భయపడిపోయిన ముసలామె ఖాతాలను ఫ్రాడ్స్టర్లు కొల్లగొట్టారు.. ఏకంగా కోట్లు దోచుకున్న ఘటన సౌత్ ముంబైలో జరిగింది. ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

సౌత్ ముంబైలో నివాసముంటున్న వృద్ద దంపతులు రిటైర్డ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓ రోజు ఉదయాన్నే వారికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాల్ కాల్ వచ్చింది..ఐపీఎస్ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న స్కామర్లు.. తైవాన్ నుంచి మీకో పార్సిల్ వచ్చింది.. అందులో5 పాస్ పోర్టులు, MDMA డ్రగ్స్ ఉన్నాయి. అవన్నీ సీజ్ చేశాం. మీరు నేరం చేశారు. ఇక జైలుకు వెళ్లక తప్పదు అని బెదిరించారు. అయితే ఇదంతా పట్టించుకోలేదు ఓల్డ్ పెయిర్..

ALSO READ | 48 గంటల్లో.. 3 కోట్ల రూపాయలు కొట్టేశారు.. బిగ్ స్కాం ఇన్ ఇండియా

ఇక అక్కడ నుంచి స్టార్టయింది వారికి టార్చర్..మేం ఐపీఎస్ ఆఫీసర్లమని చెప్పినా పట్టించుకోవడంలేదు. మీ ఆధార్ కార్డుతో వివరాలు దీనికోసం ఉపయోగించ బడ్డాయి.  మిమ్మల్ని ముంబై పోలీసులు విచారించాల్సి ఉంది అని బెదిరించారు. అంతేకాదు కాల్ ను ఓ ఫేక్ పోలీస్ ఆఫీసర్ నంబర్ కు కనెక్ట్ చేశారు. మీ ఆధార్ నంబర్ ఓ మనీలాండరింగ్ కేసులో కూడా వినియోగించబడింది. మీరు చాలా కేసుల్లో ఉన్నారు..మిమ్మల్ని విచారించాలి..స్కైప్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మాట్లాడాలని మరింత బెదిరింపులకు గురి చేశారు. కాల్ కనెక్ట్ చేసినా.. ఎవరికైనా చెప్పినా మీరు అరెస్ట్ కాక తప్పదని చెప్పారు. 

ఇలా ఆ ముసలామెను మభ్యపెట్టి, భయపెట్టి వారి దారిలోకి తెచ్చుకొని దఫాలుగా 3.80కోట్ల రూపాయలు వారి అకౌంట్లకు బదిలి చేయించుకున్నా రు. మోసపోయానని తెలుసుకున్న ముసలామె..తన కూతురికి విషయం చెప్పి బాధపడింది.. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు..ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ కేసులు బాగా పెరిగిపోయాయి..పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.. ఇందుకు ఈ కేసు ఓ ఉదాహరణ..డ్రగ్స్ పార్సిల్ వచ్చింది..మనీలాండరింగ్ కేసులో మీరు నిందితులు అంటూ పోలీసుల పేరుతో భయపెట్టి ఫ్రాడ్ స్టర్లు మోసాలకు పాల్పడు తున్నారు.. ఇలాంటి కాల్స్ పై జాగ్రత్త  ఉండాలని చెపుతున్నారు పోలీసులు.