రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలె: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలె: బీజేఎల్పీ నేత  ఏలేటి మహేశ్వర్​రెడ్డి

నిర్మల్​: రాష్ట్రంలో రుణమాఫీని కంప్లీట్​ చేశామని సీఎం రేవంత్​రెడ్డి అబద్దాపు లేఖ రాశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి అన్నారు. ఇవాళ  నిర్మల్​లో  ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు.. సీఎం ప్రధానికి రాసిన లేఖలో అవాస్తవాలు ప్రస్తావించారని తెలిపారు. 

‘రైతుల రుణమాఫీపై  రేవంత్​రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధానికి సీఎం రేవంత్​రెడ్డి లేఖ రాశారు. రుణమాఫీపై నేను చర్చకు సిద్దం.  పంట రుణాలు మాఫీ కాక రైతులు అగ్రహంగా ఉన్నారనే, వరంగల్ ​కృత‌జ్ఞత స‌భ రద్దు చేసుకున్నారు. రుణమాఫీపై స్పెషల్​డ్రైవ్ ​చేపట్టి 50 రోజులైన ఇప్పటికీ అధికారులు వివరాలు సేకరించడం లేదు. దీనిపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ’ అని ఏలేటి మహేశ్వర్​రెడ్డి డిమాండ్ ​చేశారు.

ALSO READ | ప్రభుత్వం తీపికబురు అందిస్తుంది: మంత్రి తుమ్మల